Mon Dec 08 2025 22:25:24 GMT+0000 (Coordinated Universal Time)
కేసులు తగ్గినా.. పెరుగుతున్నట్లే
దేశంలో కరోనా కేసులు కొంత స్వల్పంగా తగ్టినట్లు కన్పించినా భారత్ లో అనేక రాష్ట్రాలకు వైరస్ విస్తృతిస్తుంది.

దేశంలో కరోనా కేసులు కొంత స్వల్పంగా తగ్టినట్లు కన్పించినా భారత్ లో అనేక రాష్ట్రాలకు వైరస్ విస్తృతిస్తుంది. ఒక్కరోజులోనే 18,815 మంది కరోనా బారిన పడ్డారు. 38 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులో 15,899 కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోలుకునే వారి శాతం 98.52 శాతంగా ఉంది. కోలుకునే వారి శాతం పెరుగుతున్నా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసుల శాతం 0.27 శాతంగా నమోదయింది.
యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,25,343 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,22,335 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,29,37,876 కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 1,98,51,77,962 వ్యాక్సిన్ డోసులు వేసినట్ల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Next Story

