Sun Mar 15 2026 10:24:15 GMT+0530 (India Standard Time)
సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి
సెల్ఫీ తీసుకుంటూ యువతి ప్రమాదవశాత్తు జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.

సెల్ఫీ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఏం జరుగుతుందోనన్న స్పృహలో కూడా యువత లేకపోవడంతో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయి. సెల్ఫీ సరదా అనేక మంది ప్రాణాలను బలిగొన్నప్పటికీ ఇంకా అనేక మంది అదే బాటలో పయనిస్తున్నారు. సెల్ఫీల కోసం తెగిస్తున్నారు.
150 అడుగుల లోతులో...
మహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్నె ఘాట్‌కు స్నేహితులందరూ వెళ్లారు. అక్కడి లోయ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిలో ఓ యువతి ప్రమాదవశాత్తు జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న సేఫ్టీ బృందం ఆమెను రక్షించి క్షేమంగా పైకి తీసుకొచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Next Story

