Sat Jan 31 2026 17:12:05 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి ప్రస్తావన... సిగ్గు పడిన రాహుల్
రాహుల్ గాంధీ వద్ద పెళ్లి ప్రస్తావన తేగానే మురిసిపోయారు. భారత్ జోడో యాత్రలో ఆయన వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటున్నారు

రాహుల్ గాంధీ వద్ద పెళ్లి ప్రస్తావన తేగానే ఆయన మురిసిపోయారు. భారత్ జోడో యాత్రలో ఆయన వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటున్నారు. ఒక మహిళ రాహుల్ గాంధీతో పెళ్లి గురించి మాట్లాడుతుండగా ఆయన సరదాగా కనిపించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన చిత్రాలను కూడా జైరాం రమేష్ ట్విట్టర్ లో పంచుకున్నారు. పెళ్లి చర్చలు బాగున్నాయ్ అంటూ ఆయన ట్వీట్ చేయడం విశేషం.
పాదయాత్ర సందర్భంగా...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళకు చేరుకుంది. నిన్న తమిళనాడులో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఉపాధి మహిళ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మహిళలు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తమిళనాడు అంటే ఇష్టం కాబట్టి తమిళ అమ్మాయితో పెళ్లి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాహుల్ తో మహిళలు అన్నారు. దీంతో ఆయన చిరునవ్వులు చిందించారు. సమాధానం చెప్పకుండానే ముందుకు సాగారు. నిన్న రాత్రి తమిళనాడు నుంచి కేరళలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర చేరింది. కేరళలో ఆయనకు కాంగ్రెస్ కార్కకర్తలు ఘనస్వాగతం పలికారు.
Next Story

