Fri Dec 19 2025 02:40:27 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు దీదీ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫోన్ చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫోన్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించారు. జూన్ 15వ తేదీన న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆమె కోరారు. రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మమత బెనర్జీ యాక్టివ్ అయ్యారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు మమత బెనర్జీ లేఖ రాశారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు.
అందరు నేతలను....
రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు అందరూ హాజరు కావాలని లేఖలో కోరారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరగనుంది. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా మమత బెనర్జీ ఈ లేఖ రాయడం విశేషం. మొత్తం 22 మంది నేతలకు మమత లేఖలు రాశారు.
Next Story

