Fri Dec 05 2025 12:24:49 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ పై ఇక ఆధారపడలేం.. మమత కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ విశ్వసనీయత కోల్పోతుందని, ఆ పార్టీ పై ఆధారపడలేమని మమత అన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పారు. అందుకే అందరం కలసి కట్టుగా బీజేపీ పోరాడాలని మమత బెనర్జీ పిలుపు నిచ్చారు.
అందరూ ఏకమైతేనే....
ఉత్తర్ ప్రదేశ్ లో గెలిచింది ప్రజా తీర్పు వల్ల కాదని, ఈవీఎంల ట్యాంపరింగ్ ల వల్లనేనని మమత బెనర్జీ అన్నారు. బీజేపీని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని మమత బెనర్జీ పిలుపు నిచ్చారు. అప్పుడే మోడీని ఢిల్లీ గద్దె నుంచి దింపగలమన్నారు.
Next Story

