Sat Dec 06 2025 00:08:52 GMT+0000 (Coordinated Universal Time)
వార్నింగ్ : ఐదు రోజులు ఎండలు మండుతాయ్
రానున్న ఐదు రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది

రానున్న ఐదు రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలో రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో ఎండలు మండిపోతున్నాయి.
ఉష్ణోగ్రతలు మరింత...
మార్చి నెలలో ప్రారంభమయ్యే ఎండలు ఫిబ్రవరి నెలలోనే ఈసారి మొదలు అయ్యాయి. ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story

