Fri Dec 05 2025 09:34:35 GMT+0000 (Coordinated Universal Time)
ఇరాన్ లో ఉన్న 110 మంది భారతీయ విద్యార్థులు తరలింపు
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం కావడంతో అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులు క్రమంగా భారత్ కు చేరుకుంటున్నారు.

ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం కావడంతో అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులు క్రమంగా భారత్ కు చేరుకుంటున్నారు. ఇరాన్ లో చదువుతున్న 110 మంది భారతీయ విద్యార్థులను ఇరాన్ కు తీసకు వచ్చారు. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలం మూసివేయడంతో ఇరాన్ లో ఉన్న భారతీయ విద్యార్థులను మొవదట అర్మేనియాకు తీసుకు వచ్చారు.
జమ్మూకాశ్మీర్ కు చెందిన...
అక్కడి నుంచి భారత్ కు తీసుకు వచ్చారు. వచ్చిన 110 మంది విద్యార్థుల్లో 90 మంది జమ్మూ కాశ్మీర్ కు చెందిన విద్యార్థులే ఉన్నారు. గత వారం రోజుల నుంచి యుద్ధం జరుగుతుండటంతో విద్యార్థుల తల్లి దండ్రులు భయాందోళనల మధ్య ఉన్నారు. వీరిని భారత్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో తీసుకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులందరూ క్షేమంగా ఢిల్లీ విమానశ్రయం నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు.
Next Story

