Thu Apr 09 2026 10:21:01 GMT+0530 (India Standard Time)
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభమయింది.

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ సాగనుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ సాగనుంది.
భారీ బందోబస్తు...
పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. మూడు రాష్ట్రాల్లో ఒకే విడత పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అస్సాంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య, కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ మధ్య , పుదుచ్చేరిలో ఎన్డీఏ, డీఎంకే కూటమిల మధ్య పోటీ ఉంది.
Next Story

