Sat Dec 13 2025 19:26:56 GMT+0000 (Coordinated Universal Time)
TVK Viijay :విజయ్ యాక్షన్ లోకి దిగినట్లుందిగా.. తమిళనాట ఆట మొదలైనట్లే
టీవీకే అధినేత విజయ్ ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లుంది.

టీవీకే అధినేత విజయ్ ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లుంది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని ఆయన గట్టి గా భావిస్తున్నట్లు కనపడుతుంది. తనకున్న అభిమాన బలం, ఆదరణతో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఆయన రాజకీయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లే కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కరూర్ లో జరిగిన విజయ్ సభలో తొక్కిసలాట జరిగి నలభై మందికి పైగానే మరణించారు. అయినా రెండు నెలల్లోనే ఆయన ఆత్మవిశ్వాసంతో మరొకసారి ప్రజలకు ముందుకు రావడం నిజంగా విజయ్ పట్టుదలకు నిదర్శనం. తొక్కిసలాటకు గల కారణాలను సీబీఐ తేల్చనుంది. కానీ తాను మాత్రం జనంలో ఉండి తేల్చుకోవాలని విజయ్ సిద్ధమవుతున్నట్లే కనపడుతుంది.
అనేక విషయాలను ప్రస్తావిస్తూ...
దళపతిగా తాను తమిళనాడుకు ఏదో ఒక చేయాలన్న ఉద్దేశ్యంతోనే విజయ్ ఇక రాజకీయంగా ముందుకు వెళ్లాలనే గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కంచీపురంలో నిర్వహించిన సమావేశంలో టీవీకే అధినేత విజయ్ ప్రసంగించారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చిన ఇదే తొలి సందర్భం. ఈ సందర్భంగా ఆయన డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇసుక మాఫియా వంటి స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ, సంక్షేమంపై దృష్టి పెట్టిన ఆయన తన ఎన్నికల హామీలను కూడా సభలో వివరించారు. అయితే కంచీపురంలో జరిగిన సమావేశాన్ని బహిరంగ సభ కాకుండా ఇండోర్ లోనే ఏర్పాటు చేసి మరోసారి తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నార.
డీఎంకే పై ఫైర్...
డీఎంకే ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ, తన పార్టీ అనుసరించే సంక్షేమ విధానాలను విజయ్ వివరించారు. విజయ్ ప్రచారాన్ని డిసెంబర్ 4వన సేలంలో ప్రారంభించాలని నిర్ణయించారు.. కరూర్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను మామల్లపురంలో కలుసుకొ తర్వాత ప్రచారం ప్రారంభించాలనుకున్నారు. అయితే సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో “పీపుల్స్ మీటింగ్” పేరుతో పూర్తిగా ఇండోర్‌లో సమావేశాన్ని నిర్వహించింది. కంచీపురం జిల్లా నుండి వచ్చిన 2,000 మందికి మాత్రమే QR కోడ్ పాస్‌లతో ప్రవేశం ఇచ్చారు. ఇది ప్రజా సభ కాదని, ఇండోర్ ఇంటరాక్షన్ మాత్రమేనని స్పష్టం చేసింది. సమావేశంలో విజయ్ ఎంజీఆర్ ను పొగుడుతూనే వారి పార్టీ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.బీజేపీపై కూడా విజయ్ సున్నితంగా విమర్శలుచేశార.
Next Story

