Thu Mar 19 2026 17:40:29 GMT+0530 (India Standard Time)
వెంకయ్య నాయుడికి రెండోసారి కరోనా
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోసారి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోసారి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంకయ్య నాయుడుకు కరోనా సోకడం ఇది రెండో సారి. స్వల్ప లక్షణాలు కనపడటంతో వెంకయ్యనాయుడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ పాజిటివ్ గా తేలినట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ లో వెల్లడించింది.
హోం ఐసొలేషన్ లో....
వైద్యుల సూచన మేరకు వెంకయ్య నాయుడు వారం రోజుల పాటు హోం ఐసొలేషన్ లో ఉండనున్నారు. తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. వెంకయ్య నాయుడు గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
Next Story

