Sun Mar 15 2026 22:19:01 GMT+0530 (India Standard Time)
చెన్నైలో వెంకయ్య భోగి వేడుకలు
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భోగి వేడుకలను చెన్నైలో జరుపుకున్నారు.

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భోగి వేడుకలను చెన్నైలో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వెంకయ్య నాయుడు చెన్నైలోని కొట్టూరు పురంలోని ఆయన నివాసంలో భోగి పండగను జరుపుకున్నారు. ఈరోజు తెల్లవారు జామున ఇంటి ముందు భోగిమంటలు వేశారు.
ప్రజలందరికీ....
దేశ ప్రజలందరికీ వెంకయ్యనాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పండగ జరుపుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు.
Next Story

