Thu Mar 19 2026 06:27:32 GMT+0530 (India Standard Time)
నేడు యోగి ఆదిత్యానాధ్ నామినేషన్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన గొరఖ్ పూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన గొరఖ్ పూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. గొరఖపూర్ కు గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఆదిత్యనాధ్ గత అసెంబ్లీ ఎన్నికలలో ఎంపీ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయ్యారు.
తొలిసారి అసెంబ్లీ బరిలోకి...
ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి యోగి ఆదిత్యానాధ్ దిగనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈసారి యోగి ఆదిత్యానాధ్ ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. నామినేషన్ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
Next Story

