Mon Mar 16 2026 04:26:51 GMT+0530 (India Standard Time)
మహాత్మాగాంధీ మనవరాలు మృతి
జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకని మృతి చెందారు. ముంబయిలో ఆమె మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకని మృతి చెందారు. ముంబయిలో ఆమె మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉషా గోకని వయసు ఎనభై తొమ్మిదేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
89 ఏళ్ల వయసు....
ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంట్లో మంచానికే పరిమితమైన ఉషా గోకని రెండేళ్ల నుంచి అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధికి ఛైర్పర్సన్ గా కూడా పని చేశారు. ఆమె బాల్యం వార్థా సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిచింది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
Next Story

