Sun Dec 07 2025 05:57:29 GMT+0000 (Coordinated Universal Time)
భార్య కొడుతోందని చెట్టెక్కిన భర్త.. నెలరోజులుగా అక్కడే.. ఆఖరికి..
భార్యతో తరచూ గొడవలు పడటం, కొట్టడం ఇదే జరుగుతుండేది. అది తట్టుకోలేని భర్త ఓ 80 అడుగుల ఎత్తైన పామ్ చెట్టుపై

భర్తలు భార్యలను కొట్టడం మామూలే. కానీ భార్యలు భర్తలను కొడితే.. ఆ ఊహే నవ్వు తెప్పిస్తోంది కదూ. నిజంగా అలాంటి ఘటనే జరిగింది. భార్యతో తరచూ గొడవలు పడటం, కొట్టడం ఇదే జరుగుతుండేది. అది తట్టుకోలేని భర్త ఓ 80 అడుగుల ఎత్తైన పామ్ చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు. ఇలా ఒకటి, రెండు గంటలు కాదు. ఏకంగా నెలరోజులైంది ఆ భర్త చెట్టెక్కి. చెట్టుపైనే నివాసం ఉంటున్నాడు. ఈ విచిత్ర ఘటన యూపీలోని కోపగంజ్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది.
రామ్ ప్రవేశ్ అనే వ్యక్తి భార్య దెబ్బలు తట్టుకోలేక చెట్టెక్కాడు. నెలరోజులైనా చెట్టు దిగలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత చెప్పినా అతను చెట్టు దిగనంటే దిగనని చెప్పాడు. కాగా.. గ్రామంలోని మహిళలు రామ్ ప్రకాశ్ చెట్టు ఎక్కడంపై మరో కారణం చెబుతున్నారు. తమ ఇళ్లల్లో ఏం జరుగుతుందో చూసేందుకే రామ్ ప్రకాశ్ చెట్టెక్కాడని ఇరుగుపొరుగు మహిళలు వాపోతున్నారు. ఆఖరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆ భర్తను చెట్టు నుంచి కిందికి దించినట్లు తెలుస్తోంది.
Next Story

