Sun Feb 01 2026 18:39:43 GMT+0000 (Coordinated Universal Time)
యోగి కి తప్పిన ముప్పు
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టింది.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో అత్యవసరంగా హెలికాప్టర్ ను పైలట్ వారణాసి లో ల్యాండ్ చేశారు. దీంతో యోగి ఆదిత్యానాధ్ కు ప్రమాదం తప్పింది. వారణాసిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యానాధ్ లక్నో కు బయలుదేరి వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. అయితే హెలికాప్టర్ పైకి ఎగిరిన సమయంలోనే పక్షి ఢీకొట్టడంతో వారణాసిలోని పోలీస్ లైన్స్ గ్రౌండ్స్ లో హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేశారు.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే....
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడంతో పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ సర్క్యూట్ హౌస్ కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన లక్నో బయలు దేరి వెళ్లేందుకు విమానాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. బాబట్ పూర్ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరనుంది.
Next Story

