Fri Dec 05 2025 15:55:04 GMT+0000 (Coordinated Universal Time)
గడ్కరీ ఇంట్లో బాంబు బెదిరింపు ఎందుకు చేశాడంటే?
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదరింపు కాల్ వచ్చింది.

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదరింపు కాల్ వచ్చింది. నాగ్ పూర్ లో ఉన్న గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో వెంటనే బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది అక్కడకు వచ్చి తనిఖీలు నిర్వహించారు. పోలీసులు కూడా అప్రమత్తమయి అక్కడ ఎవరూ లేకుండా చర్యలు తీసుకున్నారు. అయితే బాంబ్ స్వ్కాడ్ తనిఖీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలింది.
అరెస్ట్ చేసి...
దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దానిని ఫేక్ కాల్ గా గుర్తించారు. కాల్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. కాల్ చేసిన వ్యక్తి నాగపూర్ తులసిబాగ్ కు చెందిన ఉమేష్ రౌత్ గా గుర్తించారు. అక్కడ మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాల్ చేయడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
Next Story

