Mon Dec 08 2025 04:11:26 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు

కరోనా ఈసారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. జనంలోకి వస్తే చాలు చుట్టేసుకుంటుంది. ముఖ్యంగా ధర్డ్ వేవ్ లో ఎక్కువగా ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. వీరిలో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎవరికీ కరోనా నుంచి మినహాయింపు లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటుగా పార్టీ నేతలు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.
హోం క్వారంటైన్ లో....
తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ గా తేలిందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. తనను వారం రోజులుగా కలసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.
Next Story

