Sat Dec 06 2025 13:59:05 GMT+0000 (Coordinated Universal Time)
మరో వివాదంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. లఖింపూర్ లో తనను ప్రశ్నించిన విలేకర్లపై ఆయన చిందులు తొక్కారు.

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. యూపీలోని లఖింపూర్ లో రైతులపై జరిగిన హింసాత్మక ఘటనను ప్రశ్నించిన విలేకర్లపై ఆయన చిందులు తొక్కారు. ఈ ఘటనలో ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన కుట్రే అని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం సయితం నివేదిక అందించింది. సిట్ నివేదికపై లఖింపూర్ లో మీడియా ప్రశ్నించగా అజయ్ మిశ్రా చిందులు తొక్కారు.
పక్కకు నెట్టేసి....
ప్రశ్నలను అడిగిన విలేకర్లను పక్కకు నెట్టేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక ఆసుపత్రిని సందర్శించి బయటకు వస్తున్న అజయ్ మిశ్రాను సిట్ నివేదికపై వివరణ అడిగినప్పడు ఆయన ఆగ్రహానికి గురయ్యారు. మెదడు పనిచేయడం లేదా. పిచ్చి ప్రశ్నలు అడగకండి. సిగ్గులేదా? అని ఆయన తోసివేశారు. అజయ్ మిశ్రా వ్యవహార శైలిపై దేశ వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Next Story

