Wed Jan 28 2026 20:34:33 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : నేడు ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు ప్రయాగ్ రాజ్ లో జరగనున్నకుంభమేళాకు హాజరు కానున్నారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు ప్రయాగ్ రాజ్ లో జరగనున్నకుంభమేళాకు హాజరు కానున్నారు. త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేయనున్నారు. పవిత్ర స్నానం ముగించుకున్న తర్వాత అమిత్ షా అఖారా సాధువులను కలవనున్నారు. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళాకు అమిత్ షా వస్తుండటంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
కోటి మందికి భక్తులకు...
మహా కుంభమేళాకు దేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. పవిత్ర స్నానాలు చేస్తున్నారు. రోజుకు కోటి మందికిపైగానే భక్తులు వస్తుండటంతో అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అమిత్ షాతో పాటు పలువురు వీఐపీలు కూడా నేడు కుంభమేళాకు రానున్నారు.
Next Story

