Mon Dec 15 2025 08:15:14 GMT+0000 (Coordinated Universal Time)
పునర్విభజనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని అమిత్ షా తెలిపారు. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామన్న అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, డీలిమిటేషన్ కమిషన్ చట్టం కాలేదని కూడా చెప్పారు.
పార్లమెంటులో చర్చించి...
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని, అందుకే కొందరు పని గట్టుకుని నియోజకవర్గాల పునర్విభజనపై విమర్శలు చేస్తున్నారన్న అమిత్ షా డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. పార్లమెంట్లో డీలిమిటేషన్‌పై చర్చిస్తామని చెప్పారు. పూర్తిస్థాయి చర్చ తర్వాతే చట్టం తెస్తామన్న అమిత్ షా పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Next Story

