Sun Mar 15 2026 20:18:18 GMT+0530 (India Standard Time)
Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్ భేటీ
నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం ఐదు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.

నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం ఐదు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరగనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. ఈసారి బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో ఎన్డీఏ కూటమి పార్టీలపై ఆధారపడటంతో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
కీలక నిర్ణయాలను...
కీలక విషయాలపై మిత్ర పక్షాల నేతలతో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ రోజు జరిగే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోయినా, కొత్త కేబినెట్ లో మంత్రులను పరిచయం చేసుకోవడంతో పాటు వారికి ప్రధాని నరేంద్రమోదీ దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

