Mon Mar 16 2026 13:12:02 GMT+0530 (India Standard Time)
నేడు మంత్రివర్గ సమావేశం
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ఎవరికి వరాలు ప్రకటిస్తారన్నది కూడా కొన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
వారికి ప్రయోజనాలను...
ప్రధానంగా రైతులకు ప్రయోజనాలను మరిన్ని అందచేస్తూ కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత జరుగుతున్న కేబినెట్ సమావేశం కావడంతో ఈసారి మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాలపై దృష్టి పెట్టి అక్కడి వారికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Next Story

