Thu Mar 27 2025 03:39:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాముంది

కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమాశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాముంది. ప్రధానంగా ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి ఊరట కల్గించేలా ఈ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.
కీలక నిర్ణయాలు...
ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. దీంతో పాటు రైతులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలుంటాయని చెబుతున్నారు. అయితే ఈ సమావేశంలో ఎక్కువ అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రమే నిర్ణయాలుంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
Next Story