Fri Dec 05 2025 13:55:29 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కేబినెట్
కేంద్ర కేబినెట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ లిమిట్ ను ఐదు లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది

కేంద్ర కేబినెట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ లిమిట్ ను ఐదు లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర కేబినెట్ ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులకు ఐదు లక్షల రూపాయల క్రెడిట్ లిమిట్ ను పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఐదు లక్షల వరకూ...
ఐదు లక్షల రూపాయల వరకూ కిసాన్ క్రెడిట్ లిమిట్ ను పెంచే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో పాటు రైతులకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా కేంద్ర కేబినెట్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశంలో వివరించనున్నారు.
Next Story

