Tue Mar 17 2026 15:59:09 GMT+0530 (India Standard Time)
మూడు చట్టాలు రద్దు.. మంత్రి వర్గం నిర్ణయం
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

ప్రధాని మోదీ చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం మంత్రి వర్గం సమావేశమయింది. ఈ సమావేశంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల ప్రకటన....
ఇటీవల మోదీ మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా మంత్రివర్గం కూడా ఈ చట్టాల రద్దును ఆమోదించింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను రద్దుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. మొత్తం మీద మోదీ చెప్పినట్లుగానే మంత్రి వర్గ సమావేశంలో చట్టాలను రద్దు చేశారు.
Next Story

