Mon Dec 08 2025 16:17:24 GMT+0000 (Coordinated Universal Time)
చనిపోయిన వారి రికార్డులు లేవు.... కేంద్ర మంత్రి సంచలన ప్రకటన
రైతులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన కామెంట్స్ చేశారు.

రైతులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన కామెంట్స్ చేశారు. రైతు ఉద్యమంలో చనిపోయారా? అంటూ ఆయన పార్లమెంటులో ప్రశ్నించడం అందరినీ నివ్వెరపరిచింది. గత ఏడాదిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులలో 750 మంది చనిపోయారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇవ్వాలని పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు.
తనకు తెలీదంటూ...
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. అయితే రైతు ఉద్యమంలో ఎంతమంది చనిపోయారో తనకు తెలియదని, రికార్డులు కూడా తన వద్ద లేవని ఆయన తెలిపారు. ఎవరికీ ఈ విషయంలో పరిహారం చెల్లించేది లేదని ఆయన పార్లమెంటు లో తేల్చి చెప్పారు.
Next Story

