Wed Jan 21 2026 02:53:02 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్లపై గుంతలు...ఉడిపిలో వింత నిరసన
కర్ణాటకలోని ఉడిపిలో రోడ్లపై గుంతలను నిరసిస్తూ పొర్లు దండాలు పెడుతూ ఒక వ్యక్తి నిరసన తెలిపారు.

కర్ణాటకలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. బెంగళూరు నగరం సయితం నీట మునిగింది. రహదారులన్నీ నీటమునిగాయి. ఇక అనేక రోడ్లు గుంతలు పడ్డాయి. వర్షం తగ్గినా గుంతలమయమైన రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలయితే ఇక చెప్పనక్కర లేదు. వాహనాలను రోడ్లపైకి తీసుకొచ్చేందుకు కూడా జనం భయపడిపోతున్నారు.
పొర్లు దండాలు పెడుతూ...
ఈ పరిస్థితుల్లో కర్ణాటకలోని ఉడిపిలో రోడ్లపై గుంతలను నిరసిస్తూ పొర్లు దండాలు పెడుతూ ఒక వ్యక్తి నిరసన తెలిపారు. నిత్యానంద ఒలకడు అనే సోషల్ వర్కర్ ఈ రోడ్లపై పొర్లుతూ ప్రభుత్వానికి తన నిరసనను తెలియజేశారు. ఉడిపిలో రహదారులను వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఆయన "ఉరుల సేవ" అని పేరు పెట్టుకుని నిరసన తెలియజేశారు.
Next Story

