Sat Mar 07 2026 21:02:13 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో ఉద్ధవ్ రాజీనామా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే ఈరోజు రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే ఈరోజు రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన నిన్ననే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. తన సొంత నివాసమైన మాతోశ్రీకి వెళ్లిపోయారు. వరసగా శివసేన ఎమ్మెల్యేలు రెబల్ క్యాంప్ నకు చేరుకుంటుండటంతో ఉద్దవ్ థాక్రే కొంత నీరసపడ్డారనే తెలుస్తోంది. ఇక చీలిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు తిరిగి రారని భావించిన ఉద్ధవ్ థాక్రే నేడు రాజీనామా చేసే అవకాశం కన్పిస్తుంది.
సమావేశాలతో....
సెక్రటేరియట్ ముఖ్య కార్యదర్శులతో ఉద్ధవ్ థాక్రే మరికాసేపట్లో సమావేశం కాననున్నారు. ఇదే చివరి సమావేశంగా శివసేన వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తన వెంట ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ఉద్ధవ్ థాక్రే వర్చువల్ గా సమావేశం కానున్నారు. షిండే పట్టు ీవీడక పోతుండటంతో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు.
Next Story

