Sat Mar 07 2026 19:17:13 GMT+0530 (India Standard Time)
షిండేకు ఉద్ధవ్ సవాల్
అసంతృప్త నేత ఏక్నాథ్ షిండే కు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. మీ నాన్న పేరు చెప్పి ఓట్లు అడగగలరా? అని ఛాలెంజ్ చేశారు.

అసంతృప్త నేత ఏక్నాథ్ షిండే కు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. మీ నాన్న పేరు చెప్పుకుని ఓట్లు అడగగలరా? అని థాక్రే ఛాలెంజ్ చేశారు. శివసేన ఎప్పుడూ హిందుత్వానికి దూరం కాలేదని అన్నారు. బాల్ థాక్రే ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. తాము ఎప్పుడూ హిందుత్వ విషయంలో రాజీపడలేదని చెప్పారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. శివసైనికులంతా తమ వెంటే ఉన్నారన్నారు.
బీజేపీతో పొత్తు...
బీజేపీతో పొత్తు విషయంపై కూడా ఉద్ధవ్ థాక్రే స్పందించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో తమ పొత్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు. శివసేన ను చీల్చే కుట్ర తాత్కాలికమేనని ఆయన అన్నారు. ప్రజలంతా శివసేనకు మద్దతుగా నిలుస్తారన్నారు.
Next Story

