Thu Mar 19 2026 04:43:07 GMT+0530 (India Standard Time)
Tamilnadu : నేడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా నేడు ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా నేడు ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆయన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటి వరకూ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఈరోజు నుంచి తమిళనాడు డిప్యూటీ సీఎం కానున్నారు.
మంత్రివర్గంలో మార్పులు...
స్టాలిన్ తో పాటు పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయం మేరకు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించనున్నారు. దీంతో తన తర్వాత రాజకీయ వారసుడు ఉదయనిధి స్టాలిన్ అని ముఖ్యమంత్రి ప్రకటించకనే ప్రకటించినట్లయింది. అయితే ఈ సందర్భంగా కొందరు మంత్రులకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన చెప్పనున్నారు. కొత్త వారితో పాటు పాత వారికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
Next Story

