Sat Apr 04 2026 04:54:00 GMT+0530 (India Standard Time)
పబ్ బయట ఓ వ్యక్తిని చితకబాదిన ఇద్దరు మహిళలు.. పోలీసులు ఏమి చేశారంటే..?
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) తూర్పు ప్రాచీ సింగ్ మాట్లాడుతూ, పోలీసులు వీడియోను సుమోటోగా స్వీకరించారని

శుక్రవారం నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని సమ్మిట్ బిల్డింగ్‌లోని పబ్ వెలుపల గొడవ సృష్టించి, ఒక వ్యక్తిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్నోలో ఒక పబ్ వద్ద యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను సుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
లక్నోలోని విభూతి ఖండ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సమ్మిట్ బిల్డింగ్ లోని 15 వ అంతస్తులో అన్ ప్లగ్డ్ కోర్టుయార్డ్ అనే పబ్ ఉంది. పబ్ బయట ఇద్దరు మహిళలు ఒకవ్యక్తిపై దాడి చేశారు. బౌన్సర్లు ఆవ్యక్తిని మహిళల బారి నుంచి విడిపించారు. ఇద్దరినీ చెరో వైపుకు తీసుకు వెళ్లారు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు ఈ వీడియోను సుమోటోగా తీసుకున్నారు. ఆ వ్యక్తిని కొట్టిన ఇద్దరు మహిళలను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మహిళల దాడిలో దెబ్బలు తిన్న వ్యక్తి ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆ మహిళలు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) తూర్పు ప్రాచీ సింగ్ మాట్లాడుతూ, పోలీసులు వీడియోను సుమోటోగా స్వీకరించారని, ఇబ్బంది కలిగించినందుకు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు. "వీడియో, పబ్ యొక్క విజిటర్ రిజిస్టర్ ద్వారా ఇద్దరు మహిళలను గుర్తించి అరెస్టు చేశారు. దెబ్బలు తిన్న వ్యక్తి తన ఫిర్యాదును నమోదు చేయడానికి ఇప్పటివరకు రాలేదు" అని ఆమె చెప్పారు. అంతకుముందు, భవనంలో నిర్వహిస్తున్న పబ్‌ల వద్ద తరచూ ఘర్షణ సంఘటనలు నమోదవడంతో భవనం గేటు వద్ద పోలీసు ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు.
Next Story

