Wed Jan 28 2026 21:04:19 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : ఢిల్లీ పార్లమెంటులో కలకలం.. ఇద్దరు ఆగంతకులు దూకి... టియర్ గ్యాస్ వదిలి
పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకారు. లోక్‌సభలోకి టియర్ గ్యాస్ ను వదిలారు

పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకారు. లోక్‌సభలోకి టియర్ గ్యాస్ ను వదిలారు. దీంతో పార్లమెంటు సభ్యులు భయంతో పరుగులు తీశారు. గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి టియర్ గ్యాస్ వదలడంతో పార్లమెంటు సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు. జీరో అవర్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. నేటికి పార్లమెంటుపై దాడి జరిగి ఇరవై రెండు ఏళ్లు అవుతుంది. సరిగ్గా ఇదే రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం కాకతాళీయమా? కావాలనే చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇద్దరు వ్యక్తులను...
అయితే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్లు కనపడింది. టియర్ గ్యాస్ వదిలిపెట్టిన వెంటనే పార్లమెంటు సభ్యులంతా భయంతో బయటకు పరుగులు తీయడం కనిపించింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. మైసూర్ కు చెందిన పార్లమెంటు సభ్యుడి పేరు చెప్పి విజిటర్స్ గ్యాలరీలోకి వారిద్దరూ ప్రవేశించినట్లు తెలుస్తోంది.
Next Story

