Tue Mar 10 2026 09:39:18 GMT+0530 (India Standard Time)
TVK : ఈరోజు విచారణకు హాజరు కాలేను : విజయ్
సీబీఐ నోటీసులకు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు

సీబీఐ నోటీసులకు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు. మరో తేదీలో విచారణకు హాజరవుతానంటూ సీబీఐకి సమాచారాన్ని విజయ్ పంపారు.నిజానికి ఈరోజు ఢిల్లీలోని సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కరూర్ తొక్కిసలాటలో జరిగిన ఘటనపై మరోసారి విజయ్ ను విచారించేందుకు ఈ రోజు రావాలని సీబీఐ నిర్ణయిచంింది.
పది రోజుల తర్వాత...
అయితే తాను ఢిల్లీ రాలేనని, సీబీఐ విచారణ చెన్నైలోనే జరపాలని విజయ్ అధికారులను కోరారు. తాను నేటి విచారణకు హాజరు కాలేనని,మరొక పది రోజుల సమయం అవసరమని ఆయన పేర్కొన్నారు. దీంతో నేడు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం విచారణకు వచ్చే అవకాశం లేదు. అయితే సీబీఐఅధికారులు దీనిపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
Next Story

