Fri Feb 27 2026 18:51:23 GMT+0530 (India Standard Time)
Breaking : టీవీకే చీఫ్ విజయ్ కు షాక్
తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ కుటుంబం నుంచి తగిలింది

తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ కుటుంబం నుంచి తగిలింది. భార్య సంగీత విడాకుల కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు. 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. విజయ్, సంగీతలకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. వివాహేతర సంబంధమే తాను విడాకులు కోరడానికి కారణమని పిటీషన్లో పేర్కొన్నారు.
విడాకులు ఇవ్వాలంటూ...
తన వద్ద అందుకు తగిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. చంగల్ పట్టు కోర్టులో విడాకుల కోసం సంగీత దరఖాస్తు చేసుకున్నారు. దీంతో న్యాయస్థానం ఏప్రిల్ 20వ తేదీన హాజరు కావాలని న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 2021 నుంచి తనను, తన పిల్లలను నిర్లక్ష్యం చేశారని, తాను కొంత కాలం నుంచి లండన్ లోనే ఉంటున్నానని సంగీత పిటీషన్ లో పేర్కొన్నారు. తమిళనాడు ఎన్నికల సమయంలో కుటుంబ పరంగా వచ్చిన ఈ సమస్య విజయ్ కు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశముందంటున్నారు.
Next Story

