Fri Apr 10 2026 22:43:45 GMT+0530 (India Standard Time)
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ ఏమన్నారంటే?
టీవీకే చీఫ్ విజయ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు

తమిళనాడుకు చెందిన టీవీకే చీఫ్ విజయ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏతో పొత్తుపై టీవీకే పార్టీ చీఫ్ విజయ్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీకి నేడు సీబీఐ విచారణకు హాజరైన విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏతో తాను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం వేరుగా ఉంటుందని చెప్పారు.
పొత్తు పెట్టుకునే..
ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విజయ్, ఎన్డీఏతో పొత్తుపై జరుగుతున్న చర్చంతా ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. తాను జనంలోకి వెళతానని, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వారే అధికారంలోకి వస్తారని విజయ్ తెలిపారు. పొత్తులపై వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలేనని అన్నారు.
Next Story

