Thu Mar 27 2025 04:04:02 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala: అయ్యప్ప దర్శనంలో మార్పు
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో దర్శన మార్గం మార్చాలని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం నిర్ణయించింది

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో దర్శన మార్గం మార్చాలని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఈ నెల 15వ తేదీ నుంచి అమలు పర్చనున్నారు. పన్నెండు రోజుల పాటు ఈ ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం దానిని అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. శబరిమలకు ప్రతి ఏటా భక్తులు పోటెత్తుతారు.లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో దర్శనం కూడా కష్టంగా మారింది. క్యూ లైన్లలో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే పద్దెనిమిది మెట్లు ఎక్కిన వెంటనే భక్తులు అయ్యప్ప స్వామి వారినినేరుగా దర్శనం చేసుకునేలా మార్పులు చేస్తున్నారు.
మెట్లు ఎక్కిన తర్వాత...
ప్రస్తుతం మెట్లు ఎక్కిన తర్వాత ఒక వంతెన మీదకు భక్తులు వెళ్లి అక్కడ క్యూ లైన్ లో వేచి ఉండాల్సి ఉంటుంది. దర్శనానికి వెళ్లేందుకు మరో క్యూ లో ప్రవేశించాల్సి ఉంటుంది. అలా కాకుండా పద్దెనిమిది మెట్లు ఎక్కిన వెంటనే స్వామి వారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తే రద్దీ కొంత తగ్గుతుందని,భక్తులు కూడా వెనువెంటనే దర్శనం చేసుకుని వెళ్లిపోతారని భావిస్తున్నారు. ఇది విజయవంతం అయితే దీనినే అమలు చేసే అవకాశముందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.
Next Story