Sat Oct 12 2024 15:14:30 GMT+0000 (Coordinated Universal Time)
వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన ట్రాన్స్ జెండర్ జంట
శ్యామా ఎస్. ప్రభ, మను కార్తీక అనే ట్రాన్స్ జెండర్లు సోమవారం పెళ్లిచేసుకున్నారు. త్రిశూర్ కు చెందిన వరుడు మనూ టెక్నోపార్క్
ట్రాన్స్ జెండర్. వీళ్లని సమాజంలో చాలా చిన్నచూపు చూస్తుంటారు. అంటరాని వారిలా లెక్కకడతారు. కానీ.. వాళ్లకీ మనసు ఉంటుంది. దానికి ప్రేమ ఉంటుంది. కానీ.. వాళ్లని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. అలా ఒక ట్రాన్స్ జెండర్ జంట కుటుంబ సభ్యుల అండతో.. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైంది. అతడు ఆమెలా, ఆమె అతడిలా మారిన ట్రాన్స్ జెండర్లు వీళ్లు. ప్రేమికుల రోజునే వారిద్దరూ సాంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిందీ సమాజం, చట్టం అంగీకరించని పెళ్లి.
శ్యామా ఎస్. ప్రభ, మను కార్తీక అనే ట్రాన్స్ జెండర్లు సోమవారం పెళ్లిచేసుకున్నారు. త్రిశూర్ కు చెందిన వరుడు మనూ టెక్నోపార్క్ లోని ఓ ఐటీ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. తిరువనంతపురానికి చెందిన శ్యామా కేరళ సోషల్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తోంది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. నిన్న పెళ్లితో ఒక్కటయ్యారు. కానీ ప్రస్తుత వివాహ చట్టాల ప్రకారం వారి పెళ్లి ఆమోదయోగ్యం కాకపోవడంతో.. తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు కేరళ హైకోర్టులో పిటిషన్ వేయాలని వారు భావిస్తున్నారు. అందుకు సంబంధించిన పత్రాలన్నీ సిద్ధం చేసినట్లు మను తెలిపాడు. వీరిద్దరి వివాహాన్ని చట్టం ఆమోదించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Next Story