Sat Dec 06 2025 09:50:12 GMT+0000 (Coordinated Universal Time)
రైలులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
మహారాష్ట్రలో రైలులో మంటలు చెలరేగాయి. రైలులో ఉన్న ప్యాంట్రీ కారులో ఈ మంటలు చెలరేగాయి.

మహారాష్ట్రలో రైలులో మంటలు చెలరేగాయి. రైలులో ఉన్న ప్యాంట్రీ కారులో ఈ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమయిన సిబ్బంది మంటలను ఆర్పివేశాు. మహరాష్ట్రలోని గాంధీదామ్ - పూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఈ మంటలు చెలరేగాయి. రైలు నందుర్ బార్ స్టేషన్ కు రాగా అక్కడి సిబ్బంది ప్యాంట్రీ కారులో వస్తున్న మంటలను చూశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ప్యాంట్రీ కారులో వస్తున్న మంటలను ఆర్పివేశారు.
ప్రయాణికులు క్షేమమే....
ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని రైల్వే శాఖ తెలిపింది. ప్యాంట్రీ కారును రైలు నుంచి వేరు చేసి మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. స్టేషన్ బయట ప్రమాదం జరిగి ఉంటే ప్రయాణికులు సయితం ఇబ్బంది పడే వారని చెబుతున్నారు. మొత్తం మీద రైలులో అగ్ని ప్రమాదం జరిగినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

