Sat Mar 07 2026 23:41:04 GMT+0530 (India Standard Time)
పిడుగుపాటుకు 14 మంది మృతి
పశ్చిమ బెంగాల్లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడటంతో పథ్నాలుగు మంది మరణించారు.

పశ్చిమ బెంగాల్లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడటంతో పథ్నాలుగు మంది మరణించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు సయితం పట్టించుకోకుండా రైతులు పొలాల్లో పనిచేసుకుంటుండగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఐదు జిల్లాల్లో పథ్నాలుగు మంది మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
జిల్లాల వారీగా...
పూర్వ వర్ధమాన్ జిల్లాలో నలుగురు, ముర్షిదాబాద్, ఉత్తర 24 పరిగణాల్లో ఇద్దరు చొప్పున పిడుగు పడి మరణించారు. దీంతో పాటు పశ్చిమ మిడ్నపూర్, హౌరా రూరల్ జిల్లాలో ఆరుగు చనిపోయారని, వీరంతా పొలాల్లో పనిచేసుకుంటుండగా పిడుగులు పడి మరణించారని అధికారులు తెలిపారు.
Next Story

