Fri Jan 30 2026 08:04:15 GMT+0000 (Coordinated Universal Time)
కోర్టులో భారీ పేలుడు... ఇద్దరి మృతి
పంజాబ్ లో విషాదం చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్ లో బాంబు పేలి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.

పంజాబ్ లో విషాదం చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్ లో బాంబు పేలి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈరోజు మధ్యాహ్నం లూథియానాలోని సెషన్స్ కోర్టు కాంపెక్ల్ లో రికార్డు రూములో ఉన్న టాయ్ లెట్ లో ఈ బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడు ధాటికి అక్కడికక్కడే ఇద్దరు మరణించారు.
వారిపైనే అనుమానం....
దీంతో ఈ బాంబు పేలుళ్లకు కారకులైన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఛండీఘడ్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పిస్తున్నారు. కోర్టులో కేసులు ఉన్నవారు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తును ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో వరసగా న్యాయస్థానంలో బాంబు పేలుడు జరుగుతుండటం కొంత ఆందోళన కల్గిస్తుంది.
- Tags
- bomb blast
- punjab
Next Story

