Fri Dec 05 2025 09:31:25 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూకాశ్మీర్ లో విషాదం.. సింధూనదిలో పడిన బస్సు
జమ్మూకాశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. సింధూ నదిలో పడిన ఐటీబీపీ బస్సు పడిపోయింది

జమ్మూకాశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. సింధూ నదిలో పడిన ఐటీబీపీ బస్సు పడిపోయింది. ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు సింధూ నదిలో పడిపోయింది. జమ్మూకశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీవర్షాల కారణంగా వాహనం అదుపుతప్పినట్లు అధికారులు తెలిపారు. అందులో ప్రయాణిస్తున్న వారంతా గల్లంతైనట్లు సమాచారం అందుతోంది.
గల్లంతయిన వారి కోసం...
ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీస్ సిబ్బందిని తీసుకెళుతున్న బస్సు సింధూ నదిలో ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోవడంతో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి.
Next Story

