Tue Mar 31 2026 14:15:10 GMT+0530 (India Standard Time)
Bihar Stampade : బీహార్ లో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది మృతి
బీహార్ లో విషాదం చోటు చేసుకుంది

బీహార్ లో విషాదం చోటు చేసుకుంది ఈరోజు ఉదయం నలంద జిల్లాలోని శీతల మాతా ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలంద జిల్లాలోని మాఘ్రా గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి చైత్రమాసంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రతి మంగళవారం ఇక్కడ అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారినిదర్శించుకుంటారు. అయితే ఒక్కసారిగా భక్తుల మధ్య తోపులాట జరిగింది.
అనేక మందికి గాయాలు...
దీంతో ఒకరి పైన మరొకరు పడి ఈ తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిమృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియచేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story

