Sat Dec 13 2025 22:31:10 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : విమాన ప్రమాదం మిగిల్చిన విషాదం.. 265 మంది మృతి
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు.అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో కేవలం విమానంలో ప్రయాణిస్తున్న వారు మాత్రమే కాకుండా అది కింద పడటంతో మరికొందరు మరణించారు. విమానంలో ఉన్న 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది మరణిచంారు. దీంతో పాటు విమానం కింద పడిన వెంటనే మరో 24 మంది అక్కడకికడే మరణించారు. దీంతో అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 265కి చేరింది. కింద ఉన్న బీజే ఆసుపత్రి హాస్టల్ భవనంపై పడటంతో మెడికోలు కూడా మరణించారు.
అత్యంత ఆధునికమైన...
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అత్యంత ఆధునికమైనది. అది ఎన్ని వేల కిలోమీటర్లయినా సులువుగా, సేఫ్ గా ప్రయాణిస్తుంది. అత్యంత ఆధునిక సౌకర్యాలతో తయారు చేసిన డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదాలు బారిన పడటం తక్కువ. అస్సలు ప్రమాదాలు జరిగేందుకు అవకాశమే లేదంటారు. అయితే విమానాశ్రయానికి దగ్గరలోనే విమానంలోర సాంకేతిక సమస్య తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. విమానం కింద పడిన వెంటనే పేలిపోయింది. లండన్ కు వెళుతుండటంతో మొత్తం 1.26 లక్షల లీటర్ల పెట్రోలు ఉండటంతో చాలా సేపు మంటలను అదుపు తెచ్చేందుకు కూడా సాధ్యం కాలేదు.
ఒక్కరు మినహా...
ఈ విమానంలో మొత్తం మూడు వందల మంది ప్రయాణించే వీలుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు పైలట్లతో పాటు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు మినహా మిగిలిన అందరూ చనిపోయారు. దీంతో పాటు లంచ్ టైమ్ కావడంతో కింద మెడికల్ హాస్టల్ లో లంచ్ చేస్తున్న వారిలో 24 మంది చనిపోయారు. అయితే ఇంకా విమానం కూలిపోవడంతో బయట ఎంత మంది చనిపోయారన్నది అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఇప్పటి వరకూ తేలిన లెక్క మాత్రం 24 మాత్రమే. ఇంకా మృతులు సంఖ్య పెరిగే అవకాశముంది. మరో యాభై మంది మెడికోలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాలని అధికారులు చెబుతున్నారు.
Next Story

