Fri Dec 05 2025 17:59:58 GMT+0000 (Coordinated Universal Time)
Lunar Eclipse : గ్రహణం ఎప్పుడు మొదలై.. ఎప్పుడు పూర్తవుతుందంటే?
ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడేనుంది. గ్రహణం సంందర్భంగా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు పండితులు సూచించారు

ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే గ్రహణం సమయంలో ఏం చేయాలి? చేయకూడని పనులు ఏంటన్నవి ఇప్పుడు తెలుసుకుందాం. పండితులు చెబుతున్న మేరకు గ్రహణం ప్రారంభమయ్యే సమయంతో పాటు పూర్తయ్యే సమయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ కథనం ద్వారా చేద్దాం. ఆదివారం రాత్రి 9.55 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అర్ధరాత్రి 1.26 గంటల వరకూ కొనసాగుతుంది. అంటే దాదాపు మూడున్నర గంటల పాటు సంపూర్ణ చంద్రగ్రహణ వీక్షించే అవకాశముంటుంది. అయితే ఈ ఆదివారం నాడు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణంతో కొన్ని రాశుల వారికి జాతకరీత్యా మార్పులుంటాయని జ్యతిష్యులు చెబుతున్నారు.
గ్రహణం రోజున...
సంపూర్ణ చంద్ర గ్రహణం 9.55 గంటలకు ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం ఏర్పడే రెండు గంటలకు ముందు ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. ఈరోజు రాత్రి 7.55 గంటలలోపు ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అయితే గ్రహణం విడిచిన మరుసటి రోజు ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా పండితులు చెబుతున్నారు. అయితే గ్రహణం ప్రారంభయిన వెంటనే స్నానం చేయాలని, చన్నీళ్లతో మాత్రమే స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు. కానీ ఏదైనా అనారోగ్యం ఉన్న వాళ్లు మాత్రం గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయవచ్చని చెబుతున్నారు. ఇక గ్రహణం విడిచిన తర్వాత తలస్నానంచేయాలని పండితులు చెబుతున్నారు. స్నానం చేసే సమయంలో వస్త్రాలుండేలా చూసుకోవాలని చెప్పారు.
గ్రహణం సందర్భంగా...
గ్రహణ సమయంలో "దుంః దుర్గాయైనమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం భగవతే రుద్రాయః" అని స్మరించాలని, వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం చదవాలని పండితులు సూచించారు. దీనివల్ల గ్రహణ దోషాలు ఏమైనా ఉటే తొలిగిపోతాయని, గ్రహణం నాడు ఈ మంత్రం పఠిస్తే మంచిదని పండితులు చెప్పారు. చిన్నారులు, గర్భంతో ఉన్న మహిళలు, వృద్దులు గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని కూడా పండితులు చెప్పారు. గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు విడిచినప్పటికీ అప్పుడే స్నానం చేయాల్సిన అవసరం లేదని, సోమవారం ఉదయం విడుపు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకుంటే మంచిదని చెబుతున్నారు.గ్రహణం సందర్భంగా కొన్ని రాశుల వారు దానాలు చేస్తే మంచిదని కూడా సూచించారు.
Next Story

