Thu Mar 19 2026 05:27:26 GMT+0530 (India Standard Time)
బంగారం ధరలకు బ్రేక్
ఈరోజు దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. బంగారం ధరలు దేశంలో నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి.

బంగారం అంటేనే అంతే మరి. ఎప్పుడూ పెరగడమే కాని ధరలు మాత్రం తగ్గవు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం, బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని ముందుగానే అంచనా వేశారు. తులం బంగారం 70 వేల రూపాయలకు చేరుకుంటుందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో పేద, సామన్య తరగతి ప్రజలకు బంగారం భారంగా మారనుంది.
నేటి ధరలు...
అయితే తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. బంగారం ధరలు దేశంలో నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,650 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 61,800 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 78,500 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story

