Sun Mar 15 2026 14:02:30 GMT+0530 (India Standard Time)
నేడు ఎన్నికల షెడ్యూల్.. తెలంగాణతో పాటు
నేడు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.

నేడు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.
ఐదు రాష్ట్రాల్లో...
ఈ ఐదు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగేది? కౌంటింగ్ ఎప్పుడు? అనేది కేంద్రం ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు ఒకే విడతలో, ఛత్తీస్గడ్ లో మాత్రం రెండు విడతలుగా పోలింగ్ జరిగే అవకాశముందని తెలిసింది. నామినేషన్ల ప్రక్రియతో పాటు ఉపసంహరణ గడువు కూడా ఎప్పుడు అనేది నేడు తెలియనుంది. కౌంటింగ్ ఒకే రోజు జరగనుంది.
Next Story

