Sun Mar 15 2026 14:58:55 GMT+0530 (India Standard Time)
Sidda Ramaiah: నేడు ఢిల్లీలో సిద్ధరామయ్య దీక్ష
కేంద్రం వ్యవహారశైలిని నిరిసిస్తూ నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో నిరసన దీక్ష చేయనున్నారు

Sidda Ramaiah:కేంద్రం వ్యవహారశైలిని నిరిసిస్తూ నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో నిరసన దీక్ష చేయనున్నారు. జంతర్ మంతర్ వద్ద ఆయన దీక్ష చేయనుండటంతో ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలు కర్ణాటక నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిగా ఆర్థిక సాయాన్ని అందచేయడం లేదని, తమకు న్యాయంగా రావాల్సిన పన్నులను కూడా బదిలీ చేయడం లేదని సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా...
బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఈ రకమైన వివక్షను కేంద్ర ప్రభుత్వం పాటిస్తుందని ఆయన మండి పడుతున్నారు. తమ రాష్ట్రమైన కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలకు నిధులు పంపిణీ సక్రమంగా చేయడం లేదని ఆయన ఆరోపించారు. 15 ఆర్థిక సంఘం కారణంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆయన ఈరోజు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలు కూడా ఉండటంతో పోలీసులు జంతర్ మంతర్ వద్ద భారీ బందోవస్తు ఏర్పాటు చేశారు.
Next Story

