Fri Dec 05 2025 23:17:36 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు అన్నీ అన్ని తొమ్మిది అంకెలే
ఈరోజు ఆల్ నైన్స్...అన్నీ తొమ్మిదిలే వస్తే...అవును 2025, సెప్టెంబర్ 9వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారు.

కొందరు అంకెలను విపరీతంగా నమ్ముతారు. తమకు కలసి వచ్చే అంకె కోసం లక్షలు ఖర్చు చేస్తారు. వాహనం అయినా.. మరేదైనా మంచి నెంబరు ఉండాలని కోరుకుంటారు. అందుకే అంకెలు జీవితంలో భాగమయ్యాయి. కొత్త వాహనం కొన్నా...కొత్త ఇల్లు అయినా...వ్యాపారం అయినా...ఉద్యోగం అయినా ఏదైనా మంచి రోజుతోపాటు మంచి అంకెతో చూడటం సాధారణంగా మారింది. కొత్త వాహనం కొంటే తొమ్మిది నెంబర్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడని వారు అనేక మంది ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు తొమ్మిది అంకె ఎంతో్ ఇష్టం.
ఏ పని అయినా...
ఏ పని అయినా తొమ్మిది సంఖ్యతో మొదలు పెడితే మంచి జరుగుతుందని విశ్వసిత్తారు. అలాంటి రోజు ఈరోజు ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 సంఖ్య అనేది ఎంతో శక్తివంతమైందని అంటారు. కొత్త పనులు ప్రారంభించటానికి తొమ్మిదిని తీసుకుంటారు. ఒక్క తొమ్మిది అంకె కోసం ఎదురు చూసే జనం ఇక అన్ని అంకెలు తొమ్మిది ఉంటే ఇక చెప్పేదేముంది. ఈరోజు ఆల్ నైన్స్...అన్నీ తొమ్మిదిలే వస్తే...అవును 2025, సెప్టెంబర్ 9వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజు మంచి పనులు చేయడానికి శుభదినంగా భావిస్తున్నారు.
తేదీ: 9వ రోజు
నెల: సెప్టెంబర్...9వ నెల
సంవత్సరం: 2025
2+0+2+5= 9
తొమ్మిదో తేదీ...తొమ్మిదో నెల...సంవత్సరం కలిపితే తొమ్మిది...9+9+9 మొత్తం 27...ఈ 27 సంఖ్యను కలిపినా మళ్లీ 9 వస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు...అంటే సెప్టెంబర్ 9వ తేదీ... మంగళవారం శక్తివంతమైన రోజు అని... మొత్తం తొమ్మిది అంకెతో ముడిపడిన రోజు అంటూ సోషల్ మీడియా లో పెద్దయెత్తున వైరల్ గా మారింది. అనేక మంది సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నేతలు కూడా దీనిని విశ్వసించి ఈరోజు మంచి పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Next Story

