Thu Mar 27 2025 03:17:30 GMT+0000 (Coordinated Universal Time)
Womens Day : మహిళలే మహారాణులు.. ఆమెదే ప్రపంచం
నేడు దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం జరుపుకుంటున్నారు

నేడు దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మహిళలు అన్ని విభాగాల్లో అధిపతులుగా ఉన్నారు. విద్య, రాజకీయ రంగాల్లో రాణిస్తూ పురుషులకు పోటీగా మరింతగా రాణిస్తూ దూసుకుపోతున్నారు. మహిళలు ఒకప్పుడు వంటింటికే పరిమితమయ్యే వారన్న నినాదానికి చరమగీతం పాడి నేడు తాము కూడా ఎందులోనూ తగ్గమంటూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో వెళుతున్నారు. భూమండలం నుంచి స్పేస్ వరకూ మహిళలు లేనిదే ఏ పని జరగడం లేదు. వారి అండ, సహకారంతోనే అభివృద్ధి వైపు పయనం సాగుతుంది.
అన్ని రంగాల్లో...
వ్యాపార రంగంలోనూ మహిళలు ఒంటరిగా రాణిస్తూ మహిళ పారిశ్రామికవేత్తలుగా దేశంలోనే కాదు అంతర్జాతీయంగానే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే పెదవి విరిచే వారు నేడు అదే జరిగితే మహాలక్ష్మి ఇంట పుట్టిందన్న భావన వచ్చిందంటే అది మహిళలు ప్రత్యేకంగా లభిస్తున్న గుర్తింపు అనిచెప్పాలి.ప్రభుత్వాలు కూడా మహిళలకు అధికప్రాధాన్యత ఇస్తూ మహిళలు - మహిళారాణులుగా రాణిస్తుండటంతో పురుషులు వెనకబడి పోయారు. ఐఏఏస్,ఐపీఎస్ ల దగ్గర నుంచి అన్ని రకాల ఉపాధి అవకాశాలను మహిళలు చేజిక్కించుకుని తమకు తిరుగులేదని చాటి చెబుతున్నారు.
సంక్షేమం..అభివృద్ధికి...
నేడు దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి మరింత ప్రోత్సహం అందించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టడమే కాకుండా వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయంటే మహిళ శక్తి ఏ మేరకు చాటిచెబుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మహిళలు లేనిదే అవని లేదని భావించిన ప్రభుత్వాలు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వారి ఆగ్రహానికి లోనుకాకుండా, అనుగ్రహం కోసం తాపతప్రపడటం కోసమే ఇప్పుడు అందరి ప్రయత్నం. అందుకే మహిళలు ఇప్పుడు మహారాణులు అని చెప్పక తప్పదు.
Next Story