Fri Dec 05 2025 12:48:10 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా ధర పెరుగుదల
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరగడం విశేషం

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటి పెరుగుదల ఆగదు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, దిగుమతులను తగ్గించడంతోనే బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పినట్లుగానే బంగారం ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యక్రమాలకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుండటంతో కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
వెండి కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరగడం విశేషం. పది గ్రాముల బంగారంపై రూ.800లు పెరిగింది. కిలో వెండి ధరపై రూ.700లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,500 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,640 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 81,800 రూపాయలకు చేరుకుందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి.
Next Story

